డాక్టర్ ఎందుకు మేడమ్ సిగ్గు? మనం బాగుండాలి అంటే వేరే వాళ్ళు ఏడ్వాలి, ఏదయినా మనల్ని మనం ప్రేమించుకోవడం, మన మంచి కోసం ఎవరినైనా ముంచడం, అదే నేటి జీవన విధానం లేకుంటే మనం బ్రతకలేము, మంచి చేయడం అన్నది పుస్తకాల్లో ఇంకా ఉపన్యాసాల్లో" బాగుంటుంది అంతే.మాధవ్ అవునా ? ఇదే సమస్య మీ ఇంటి అమ్మాయికి వస్తే కూడా అలానే మాట్లాడతారా ? డాక్టర్ అసలు మాట్లాడను, ఆమెని కాపాడడనికి ట్రై చేస్తాను, కానీ నేనా ఆమేనా అనే సందర్భం వస్తే మాత్రం ఆమెని వదిలేస్తా, నిజానికి నాకంటే నాకు ఎవరు ముఖ్యం కాదు.విక్రమ్ అందుకే నిన్ను అరెస్ట్ చేస్తున్నాం, మాధవ్ అరెస్ట్ చేయి. మాధవ్ ఒరేయ్ నాకు సంకెళ్లు వేయడం రాదు .అఖిల వెంటనే ఆమెకి సంకెళ్లు వేసింది .మాధవ్ నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావు సంకెళ్లు వేయడం చెల్లి ? అఖిల ఎన్ని సినిమాల్లో సిరీస్ ల్లో చూడలేదు.మాధవ్ ఓహో అందుకే పోకిరి డైలాగు వాడవా?. హీహీహీ అని నవ్వింది అఖిల.డాక్టర్ ఎవరు మీరు? పోలీస్ లా, మా వాళ్ళకి గవర్నమెంట్ లో పెద్ద వాళ్ళ సపోర్ట్ ఉంది. విక్రమ్ ఆ పెద్దల్ని ఏదో ఒకటి పీకండిరా... అని మమల్ని పంపారు.డాక్టర్ మీరు ఎవరు ? విక్రమ్ నేను ఏజెంట్ 12667 విక్రమాదిత్య.
- | Author: Tejoram Chamarthi
- | Publisher: Kasturi Vijayam
- | Publication Date: Aug 04, 2025
- | Number of Pages: 240 pages
- | Binding: Paperback or Softback
- | ISBN-10: 8198710825
- | ISBN-13: 9788198710826